ఆసలు ఇదేంటో?

ఆసలు ఇదేంటో?


మీకు మదిలో ఈ ప్రశ్న మెదిలిఉండచ్చు. కొత్తది ఏదైనా చూసి చూడగానే అతి సహజంగా మన మెదడు తన నాడుల్ని ఝళిపించి ఇలా ప్రశ్నలతో ఎదురు నిలుస్తుంది.

మనమున్నది ఎంతో వెగంగా ఎవరికోసము ఆగకుండా, ఎక్కడికో కూడా తెలియకుండా వెళ్ళిపోయే ప్రపంచం. ఇందులో కాలాన్ని కూడ లక్ష్మీ దేవిలా భావించాల్సి వస్తోంది. అందువలన, క్లుప్తంగా చెప్పాలంటే, పొద్దున్నే లేచి లేవగానే జిహ్వకి మీద కాఫి వేసే రంగవల్లులు తనువుని ఉత్తేజితం చేసి, ముందుండే మన రోజుకి, "చెంచాడు భవసాగరం" ఇదడానికి మనల్ని సంసిద్ధుల్ని చేస్తుంది. అదే ఆ కప్పు కాఫీ తో ఒక మాంచి కవిత జొడించారే అనుకోండి, మాహద్భుతంగా ఉంటుంది! అందుకే, కాఫీ తో చదువుకోడానికి ఈ "కాఫీ తో కవిత్వం"!

No comments:

Post a Comment